కుటుంబతగాదాలకు ముగ్గురు చిన్నారులు బలయ్యారు

Published: Monday August 06, 2018
 à°¦à°‚పతుల మధ్య నెలకొన్న కుటుంబతగాదాలకు ముగ్గురు చిన్నారులు బలయ్యారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం శెట్టిగారిపల్లెల్లో à°ˆ దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే తన ముగ్గురు పిల్లలను నీవా నదిలో పడేసి చంపేశాడు. భార్య కాపురానికి రావడం లేదనే ఆగ్రహంతో వెంకటేష్ అనే వ్యక్తి à°ˆ దారుణానికి పాల్పడ్డాడు. మృతులు పునీత్(5), సంజయ్(3), రాహుల్(2)à°—à°¾ గుర్తించారు.
 
వెంకటేష్, అమరావతిలకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. కాగా వెంకటేష్ తాగుడుకు బానిసవడం దంపతుల మధ్య తరచూ గొడవలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో అమరావతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి రావాల్సిందిగా భర్త వెంకటేష్ కోరగా అందుకు ఆమె నిరకరించింది. ఆగ్రహంతో ఊగిపోయిన వెంకటేష్ గత రాత్రి తన ముగ్గురు పిల్లలను తీసుకుని వెళ్లి నీవా నదిలో పడేసి చంపేశాడు. మద్యం మత్తులో వెంకటేశ్ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అన్నెంపున్నెం ఎరుగని చిన్నరులను తండ్రి దారుణంగా చంపేయడంతో జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న వెంకటేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.