ప్రాణాలు తీసిన కల్తీమద్యం

Published: Monday August 06, 2018

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సత్యవాడలో విషాదం చోటు చేసుకుంది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా పార్టీ చేసుకున్న ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కల్తీ మద్యం కారణంగానే వారు మరణించినట్లు తెలుస్తోంది. మృతులు ఆచంట ప్రసాద్ (19), పొన్నగంటి సుధీర్(17)గా గుర్తించారు. మరో యువకుడు శివ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.