పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది...కాని ...

Published: Tuesday August 14, 2018
విజయవాడ: పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది... లెక్చరర్‌గా పనిచేస్తూ భర్తకు ఆర్థికంగా అండగా నిలవాలనుకుంది. అయినా భర్త వద్ద మెప్పు పొందలేక చివరికి తను వుచాలించింది. రామవరప్పాడు రాజుల బజార్‌లో నివసిస్తున్న పసుపులేటి షణ్ముఖి (30) ఉన్నత విద్యాభ్యాసం చేసింది. ఏలూరు సీఆర్‌రెడ్డి కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. 2012లో నగరంలోని పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న పసుపులేటి విజయానంద్‌ను ప్రేమించింది. ఇరుపక్షాల పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకుంది. వీరికి ఐదేళ్ల బాబు ఉన్నాడు. భర్త విజయానంద్‌ కొద్దికాలంగా ఉద్యోగం మానేసి ఇంటివద్దే ఉంటున్నాడు.
 
గడచిన ఏడాదిగా భర్త మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను ఏకంగా ఇంటికే తీసుకొ చ్చేవాడు. ప్రశ్నించిన భార్యను కొట్టి, విడాకులు ఇవ్వాలని, లేకుంటే పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలని, అప్పుడు కలిసి ఉండొ చ్చు అని చెప్పడంతో మానసికంగా కుంగిపోయింది. భర్త వివాహే తర సంబంధం విషయమై షణ్ముఖి నిలదీసింది. నీవు చనిపోయి నా పర్వాలేదు, నేను మాత్రం ఆమెతోనే ఉంటానంటూ భర్త తెగేసి చెప్పడంతో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పటమట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.