ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని స్వగ్రామంలో ఆత్మహత్య

Published: Wednesday August 15, 2018
కురబలకోట మండలంలోని à°“ ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థిని స్వగ్రామంలో ఆత్మహత్య చేసుకుంది. à°ˆ సంఘటనకు ర్యాగింగ్‌ కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపి స్తున్నారు. వివరాలివీ... అనంతపురం జిల్లా కదిరి మండలం పట్నానికి చెందిన ప్రియాంక బాయి(19) అంగళ్లు సమీపంలోని గోల్డెన్‌వ్యాలీ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇటీవల కళాశాలకు వరుస సెలవులు రావడంతో స్వగ్రామానికి వెళ్లింది. à°ˆ నేపథ్యంలో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది.
 
కాగా, ప్రియాంక మృతికి కళాశాల యాజమాన్యం వేధింపులు, సీనియర్ల ర్యాగింగ్‌ కారణమని ఆమె కుటుం బసభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనకు కారణమైన వారందరిపై à°•à° à°¿à°¨ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే వ్యక్తిగత, కుటుంబ సమస్యలతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్లు గోల్డెన్‌వ్యాలీ యాజమాన్యం చెబుతోంది. తమకు సంబంధం లేని అంశంపై ఆరోపణలు చేయడం సబబుకాదని అంటోంది. à°ˆ సంఘటనపై మదనపల్లె రూరల్‌ సీఐ రమేష్‌ కళాశాలలో విచారణ చేపట్టారు. విద్యార్థిని మృతికి à°—à°² కారణాలను అధ్యాపకులు, విద్యార్థులను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. విచారణ పూర్తయ్యాక అన్ని వివరాలను వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు