అత్తను హతమార్చిన కోడలు
Published: Friday August 17, 2018

వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నదనే అక్కసుతో అత్తను దారుణంగా హత్యచేసిన కోడలి ఉదంతమిది. ఇందుకు సంబంధిం చి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మాచవరంలో మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కోయ రామాంజనేయులుకు సుమారు 10 ఏళ్ల క్రితం పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన విజయలక్ష్మితో వివాహమైంది. వారికి కుమా రుడు, కుమార్తె ఉన్నారు. విజయలక్ష్మికి అదే కొత్త పాలెం గ్రామానికి చెందిన వేరొకరితో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆరునెలల కిందట ఆమెను పుట్టింటికి (గుత్తికొండ) పంపారు. సుమారు 20 రోజుల క్రితం విజయలక్ష్మి తిరిగి భర్త ఇంటికి వచ్చింది. రామాంజనేయులు, విజయలక్ష్మి గురువారం పొలం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఒంటి గంటకు ఇంటికి వచ్చారు. ఇంట్లో సరుకుల కొనుగోలు కోసం భర్త మాచవరం వెళ్లాడు. ఈ మధ్యలో విజయలక్ష్మి అత్త సరోజనమ్మను గుర్తు తెలియని మారణా యుధంతో తలపై కొట్టటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందింది. అటు తరువాత ఏమీ తెలియనట్లు విజయలక్ష్మి ఇంట్లో పని చేసుకొంటున్నట్లు నటించింది. మాచవరం నుంచి తిరిగి వచ్చిన రామాంజనేయులు వంటగదిలోకి వెళ్లి చూసే సరికి తల్లి సరోజనమ్మ రక్తపు మడుగులో ఉంది. ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతిచెం దింది. రామాంజనేయులు భార్యను పిలిచి అడగ్గా తనకేమీ తెలియదని బదులిచ్చింది. ఇరుగు పొరుగు వారికి విషయం తెలియడంతో మాచవరం పోలీసుల కు సమాచారం అందింది. పిడుగురాళ్ల రూరల్ సీఐ సుబ్బారావు, మాచవరం ఎస్‌ఐ జగదీష్‌లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిందితురాలు విజయలక్ష్మిని అదుపు లోకి తీసుకుని మాచవరం పోలీసు స్టేషన్‌కు తరలిం చారు. హత్యకు ఉపయోగించిన ఆయుధం సంఘటన స్థలంలో కన్పించలేదు.
మా కోడలే వేరే వారితో కలసి చంపింది: మామ
తమ కోడలు కొందరు గ్రామస్థులతో కలసి తన భార్య సరోజనమ్మను చంపిందని విజయలక్ష్మి మామ కోయ వీరయ్య విలేకరులకు తెలిపాడు. విజయలక్ష్మి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో ఆరునెలల కిందట పుట్టింటికి పంపామనీ, 20 రోజుల క్రితమే మళ్లీ తిరిగొచ్చి అఘాయిత్యానికి పాల్పడిందనీ ఆరోపించాడు. రామాంజనేయులు అమాయకుడు కావడంతో ఆమె ఇష్టానుసారం వ్యవహరిస్తూ చివరికి ఈ ఘాతుకానికి పాల్పడిందని వాపోయాడు.

Share this on your social network: