పెళ్లి చేసుకుంటానని చెప్పి.. రూమ్‌కు తీసుకెళ్లి..

Published: Saturday August 18, 2018

పొన్నూరు, గుంటూరు: పెళ్ళి చేసుకుంటానని ఓ బాలికకు మాయ మాటలు చెప్పిన యువకుడు బలవంతంగా ఆమెను తన రూముకు తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. స్థానిక అర్బన్‌ పోలీసుల కథనం ప్రకారం... పెప్సీ గోడౌన్‌ వెనుక ఉండే క్రేన్‌ డ్రైవర్‌ నాగిడి రామకృష్ణ మాయమాటలు చెప్పి బాలికపై ఆగస్టు 15న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు నలతగా ఉండడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన సంగతి తెలిపింది. దీంతో వారు ఆ యువకుడి వద్దకు వెళ్ళి తమ కుమార్తెను పెళ్ళిచేసుకోవాలని అడిగారు. పెళ్ళి చేసుకోనని అతడు చెప్పడంతో బాధితురాలి తల్లి శుక్రవారం అర్బన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అర్బన్‌ స్టేషన్‌ సీఐ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.