ఇద్దరు కూతుళ్ళపై ఏడాదిగా తండ్రి అత్యాచారం
Published: Friday August 24, 2018

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు కూతుళ్ళపై ఏడాదిగా తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. నేపాల్ దేశం నుంచి వలసవచ్చిన రాజ్ బహదూర్ కుటుంబం శంషాబాద్‌లో నివాసముంటోంది. రాజ్ బహదూర్ ప్రస్తుతం హైమద్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కాగా... తమ ఇద్దరు కూతుళ్ళపై రాజ్ బహదూర్ ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న విషయాన్ని తల్లి గమనించింది. అనంతరం ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this on your social network: