తిరుమల హుండీలో చోరీ

Published: Saturday August 25, 2018

తిరుమల: తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రధాన హుండీలో చోరీకి యత్నించిన వ్యక్తిని విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. శుక్రవారం రాత్రి ప్రధాన హుండీలో చోరీకి ప్రయత్నిస్తుండగా అక్కడ విధుల్లో ఉన్న విజిలెన్స్‌ సిబ్బంది గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించగా చోరీకి ప్రయత్నించినట్టు స్పష్టమైంది. నిందితుడు గతంలో కూడా పలు చోరీలు చేసి పట్టుపడినట్టు సమాచారం. అయితే ఆ వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచారు.