వివాహేతర సంబంధాలే ప్రధానం

Published: Monday August 27, 2018
విజయవాడ: à°¬à°‚ధాలు కొత్త అర్థాలను వెతుక్కుంటున్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు సరికొత్త పరిచయాలను అందుకుంటున్నాయి. సక్రమంగా లేని బంధాలను కలుపుకొంటున్నాయి. మోజు ముసుగులో అసలు బంధాన్నే తెంచుకుంటున్నాయి. అవసరం తీరాక అపార్థాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి ఫిర్యాదులు ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు రోజుకు సరాసరిన ఆరేడు వస్తుంటే, అందులో మూడు కేసులు వివాహేతర సంబంధాలకు చెందినవే. సమస్యలు, ఆకర్షణలు వివాహేతర సంబంధాలకు రెండు దారులుగా మారుతున్నాయి. విషయం బయటకు పొక్కనంత వరకు à°ˆ సంబంధాలు సజావుగానే సాగుతాయి. à°† తర్వాత ఎక్కడ చిన్న వ్యత్యాసం వచ్చినా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జీవిత ప్రయాణం విషాదమవుతోంది. గౌరవ, మర్యాదలు మంట కలుస్తున్నాయి.
 
అయితే హత్య... కాకపోతే ఆత్మహత్య..
సాంకేతిక పరిజ్ఞానం పెరిగాక పరిచయాల పరిధులు మారిపోతున్నాయి. సక్రమ సంబంధాలు చెక్కు చెదిరిపోతున్నాయి. కుటుంబంలో ఉండే ఆర్థిక ఒడిదుడుకులు, భార్యాభర్తల మధ్య కొరవడుతున్న అనురాగ, ఆప్యాయతలు, అపరిచిత వ్యక్తులతో సంబంధాలకు దారితీస్తున్నాయి. ఇష్టం లేకుండా పెద్దలు కుర్చిన వివాహం చేసుకున్న వారు కొందరు, మనసిచ్చి మనువాడిన వాడి మాయమాటలకు బాధితులైన వారు సరికొత్త ఆకర్షణలవైపు చూస్తున్నారు. పనిచేసే ప్రాంతంలోనో, పిల్లలను స్కూల్‌à°•à°¿ తీసుకెళ్లినప్పుడో ఏర్పడిన పరిచయాలు, ఫేస్‌బుక్‌ స్నేహాలు రోజులు గడిచేకొద్దీ పెద్దల మధ్య ఏర్పడిన పెళ్లి బంధాలను దూరం చేస్తున్నాయి. రహస్య బంధాలను ఏర్పరుస్తున్నాయి.
 
à°ˆ వ్యవహారాలు జీవిత గమనాన్ని అధోగతిపాలు చేస్తున్నాయి. భార్య తనను మోసం చేసిందన్న ఆగ్రహంతో భర్త ఆమెను అంతమొందిస్తున్నాడు. కట్టుకున్న వాడితో కటీఫ్‌ చేసుకుని కొత్త అడుగులు పడుతున్న దాంపత్యంలోనూ అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ చెరోదారి చూసుకున్నాక సరికొత్త సమస్యలు వస్తున్నాయి. ఇదంతా ప్రాణాలు తీసుకునే పరిస్థితులకు దారితీస్తున్నాయి.
 
 
లగ్జరీ లైఫే ప్రధాన కారణం
వివాహేతర సంబంధాలు ఒకప్పుడు గుట్టుచప్పుడు కాకుండా ఉండేవి. ఊళ్లలో తెలిస్తే పరువు పోతుందనో, సమాజంలో గౌరవం ఉండదనే భయం ఉండేది. ఇప్పుడు à°Žà°‚à°¤ చిన్న విషయమైనా బయటకు పొక్కిపోతుంది. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక కాంటాక్ట్‌లు బాగా పెరిగిపోయాయి. వివాహేతర సంబంధాలు పెరగడానికి ఇదొక కారణమైతే, లగ్జరీలు మరో కారణం. సమాజంలో లగ్జరీగా జీవించేతత్వం పెరిగింది. దీనివల్ల రకరకాల సంబంధాలు ఏర్పడుతున్నాయి. లగ్జరీల వైపు చూస్తున్న వ్యక్తులు వివాహేతర సంబంధాన్ని చాలా చిన్న విషయంగా చూస్తున్నారు. విలువలను వదిలేస్తున్నారు. మహిళలైనా, పురుషులైనా దూరప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం, à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ జీవించడం, వివాహాలు ఆలస్యం కావడం వంటి కారణాలతో వివాహేతర సంబంధాలు బలపడుతున్నాయి. వాస్తవానికి స్త్రీలు ఎమోషనల్‌à°—à°¾ అటాచ్‌ అవుతారు. పురుషులు మాత్రం మోటివేషనల్‌గానే అటాచ్‌ అవుతారు.