స్మగ్లర్ల రాళ్ల దాడి...పోలీసుల కాల్పులు....

Published: Saturday September 01, 2018

శ్రీకాళహస్తి: à°šà°¿à°¤à±à°¤à±‚రు జిల్లాలోని అటవీప్రాంతంలో తమిళ స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. కూబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులపై స్మగ్లర్లు దాడికి తెగబడ్డారు. వెంటనే అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు స్మగ్లర్లపై ఎదురుదాడి చేశారు. à°ˆ ఘటనలో à°“ స్మగ్లర్ మృతి చెందగా, పలువురు అటవీశాఖ సిబ్బంది గాయపడ్డారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని మేల్ చూర్ బీట్ అడవిలో రైల్వేకోడూరు అటవీశాఖ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తుండగా 50 మంది తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు. దీంతో అటవీశాఖ సిబ్బందిపై స్మగ్లర్లు రాళ్లతో దాడికి తెగబడంతో అటవీ సిబ్బంది కాల్పులు జరిపినట్లు కోడూరు రేంజిరేంజర్ నయిమ్ అలీ తెలిపారు. à°ˆ ఘటనలో గాయపడిన ఎఫ్‌బిఓ జగన్, బేస్ క్యాంప్ సిబ్బందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని, ఇంకా కూంబింగ్ జరుగుతోందని అలీ వెల్లడించారు.