గుంటూరులో నకిలీ మద్యం.....
Published: Sunday September 02, 2018

బాపట్ల: గుంటూరు జిల్లా డెల్టాలో మరోసారి నకిలీ మద్యం కలకలం రేపుతోంది. బాపట్ల మండలం యాజలీలో మద్యం తాగి దంపతులు మృతి చెందారు. చిలకజోస్యం చెప్పే అంజయ్య, మారమ్మ దంపతులు గత రాత్రి నిజాంపట్నంలో చీప్ లిక్కర్ సేవించారు. అనంతరం వారు మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు లిక్కర్ కల్తీ మద్యంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలం క్రితం నిజాంపట్నం ప్రాంతంలో పలుమార్లు నకిలీ మద్యం వెలుగుచూసిన విషయం తెలిసిందే. మృతులు బాపట్ల మండలం నగరం వాసులుగా గుర్తించారు.

Share this on your social network: