వీరు కనిపిస్తే.. సమాచారమివ్వండి
Published: Monday September 03, 2018

విజయవాడ: నగరంలో ఆదివారం ఒక్కరోజే గంట వ్యవధిలో రెండు చోట్ల జరిగిన గొలుసు దొంగతనాలను ఇద్దరు యువకులు చేసినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆదివారం ఉదయం 10.30 గంటల సమయంలో బీఆర్టీఎస్ రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న వృద్ధురాలి మెడలో మూడున్నర కాసుల బంగారు నానుతాడు తెంచుకుని ఇద్దరు యువకులు పరారయ్యారు. ఈ నేరం జరిగిన గంట వ్యవధిలోనే ఒకటో డివిజన్ పరిధిలో మరో గొలుసు దొంగతనం జరిగింది. ఆరు కాసుల బంగారు చైన్ స్నాచింగ్ చేశారు. ఈ రెండు దొంగతనాలను ఆ యువకులే చేశారని తేల్చిన పోలీసులు వారి పట్టుకునేందుకు గాలిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలో లభ్యమైన ఫొటోల్లోని వ్యక్తులు నగరంలో ఎక్కడైనా కనపడితే వెంటనే 100కుగాని వాట్సాప్ నెంబరు 7328909090కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.

Share this on your social network: