అప్పుకట్టమని అడిగినందుకు...దారుణం

Published: Saturday September 15, 2018

గోపాలపురం: పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం బీమోలులో దారుణం చోటు చేసుకుంది. అప్పుకట్టమని అడిగిన పాపానికి ఓ వ్యక్తిని చంపేందుకు యత్నించాడు మరోవ్యక్తి. స్థానికంగా ఉంటున్న శ్రీనివాస్(50) కిళ్లీకొట్టు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వంశీ అనే యువకుడు అతడి వద్ద సిగరెట్ కొనేందుకు వచ్చాడు. అయితే పాతబాకీ కట్టాలంటూ శ్రీనివాస్ పట్టబట్టాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వంశీ...శ్రీనివాస్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి తరలించారు. శ్రీనివాస్ బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.