అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

Published: Monday September 24, 2018

పార్వతీపురం: విజయనగరం జిల్లా పార్వతీపురం గెడ్డ వీధిలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో భార్య సోఫియాను కట్టుకున్న భర్త లక్ష్మీనారాయణ అతి కిరాతకంగా కొట్టి చంపాడు. అనంతరం అతడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలు సోఫియా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాగా, భర్త లక్ష్మినారాయణ ఆటో డ్రైవర్‌గా ఉన్నాడు