ప.గో జిల్లాలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
Published: Saturday November 17, 2018

భీమడోలు: పశ్చిమగోదావరి జిల్లాలోని భీమడోలు మండలం పాతురు షుగర్ ప్యాక్టరీ దగ్గర శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందగా, క్లీనర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. లారీ టైర్ మారుస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Share this on your social network: