వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.

Published: Sunday November 25, 2018

ఏలూరు: ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి మహానగరాల్లో ఉన్న వ్యభిచార గృహాలకు కాంట్రాక్టు పద్ధతిపై పంపించే ఒక మహిళను ఏలూరు యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ యూనిట్‌ ఎస్సై డి.గంగాభవాని అరెస్టు చేశారు. ఏలూరులోని ఖండ్రికగూడెంకు చెందిన ఆకుర్తి వెంకటలక్ష్మి(27) ఖమ్మం జిల్లా నుంచి ఒక యువతిని తీసుకువచ్చి, చెన్నై, హైదరాబాదు, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్లకు ఆ యువతిని అక్కడి వ్యభిచారం చేయడానికి కాంట్రాక్టు పద్ధతిపై ఐదు రోజులు, పది రోజులు పంపిస్తుంటుంది. సమాచారం అందుకున్న ఎస్సై గంగాభవాని తన సిబ్బందితో శనివారం రాత్రి దాడి చేయగా ఒక యువతి, ఒక విటుడు ఆ ఇంటిలో ఉన్నారు. ఆకుర్తి వెంకటలక్ష్మిని అరెస్టు చేశారు. యువతిని, విటుడిని అదుపులోకి తీసుకుని ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.