పోలీసులపై స్మగ్లర్ల రాళ్ల దాడి

Published: Saturday December 01, 2018
తిరుపతి: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. చంద్రగిరి మండలం మామిడిమాను గడ్డ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లు తారపడ్డారు. దీంతో పోలీసులపై స్మగ్లర్లు రాళ్లతో దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. 70 మంది స్మగ్లర్లలో ముగ్గురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. ఘటనాస్థలంలో 50 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.