మరో 5 నోటిఫికేషన్లు

Published: Friday December 21, 2018
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శుక్రవారం మరో ఐదు నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన మేరకు నెలాఖరులోగా మిగిలిన ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ పూర్తి చేయనుంది. ఏపీపీఎస్సీ చైర్మన్‌ పిన్నమనేని ఉదయభాస్కర్‌ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో జరిగిన కమిషన్‌ సమీక్షా సమావేశంలో à°ˆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న 109 ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (గ్రేడ్‌-1) పోస్టులు, ఎండోమెంట్‌ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 60 ఈవో (గ్రేడ్‌-3) పోస్టులు, సమాచార, పౌర సంబంధాల శాఖలో ఖాళీగా ఉన్న 15 అసిస్టెంట్‌ పీఆర్‌వో పోస్టులు, సీసీఎల్‌ఏ విభాగంలో ఖాళీగా ఉన్న 29 డిప్యూటీ సర్వేయర్‌(క్యారీ ఫార్వర్డ్‌) పోస్టులతో పాటు అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు శుక్రవారం విడుదల చేయాలని కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. అలాగే à°ˆ నెల 26à°µ తేదీన 1067 గ్రూప్‌-3(పంచాయతీ సెక్రెటరీ) పోస్టులకు, 200 జూనియర్‌ లెక్చరర్లు, 308 డిగ్రీ లెక్చరర్లు, 406 పాలిటెక్నిక్‌ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్లు జారీచేయాలని కూడా నిర్ణయించారు.
 
à°ˆ నెలాఖరులోగా మిగిలిన ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక గ్రూప్‌-1, గ్రూప్‌-2 సర్వీసుల నోటిఫికేషన్ల విషయంలో మాత్రమే అనిశ్చితి నెలకొంది. గ్రూప్‌-2లోని ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-1లో ‘1బి’ కిందకు తీసుకురావాలని గతంలో ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను కొత్త నోటిఫికేషన్లకు అమలు చేయాలా? వద్దా? అన్న విషయంలో à°ˆ సందిగ్ధత ఏర్పడింది. నిరుద్యోగుల నుంచి అభ్యంతరం వ్యక్తం కావడంతో à°—à°¤ నోటిఫికేషన్లకు సదరు ఉత్తర్వులు అమలు చేయకుండా నిలుపుదల చేశారు. అయితే అప్పట్లో ‘à°ˆ ఒక్కసారికే మినహాయింపు’ అనేలా సంకేతం ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేయాలనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. à°ˆ విషయమై ఏపీపీఎస్సీ తాజాగా ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా ఇంతవరకు ఎలాంటి సమాచారమూ రాలేదు. గతంలో భర్తీ కాకుండా మిగిలిన (క్యారీ ఫార్వర్డ్‌) పోస్టులను కొత్త నోటిఫికేషన్లలో కలపాలని కూడా కమిషన్‌ సమావేశంలో నిర్ణయించారు. ఆర్థికశాఖ నుంచి అనుమతి లభించిన తర్వాత ఏపీపీఎస్సీ ఇప్పటి వరకూ ఏఈఈ, ఎఫ్‌ఆర్‌వో, ఏఎంవీఐ, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీ కోసం ప్రకటనలు జారీ చేసింది