నర్సింగ్‌ ప్రమోషన్ల వ్యవహారం రచ్చకెక్కింది

Published: Friday August 30, 2019
రాష్ట్రంలోని నర్సింగ్‌ కళాశాలల్లో బోధనా సిబ్బంది ప్రమోషన్ల వ్యవహారం రచ్చకెక్కింది. అర్హులకు పదోన్నతులు ఇవ్వకుండా డీఎంఈ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని విమర్శలొస్తున్నాయి. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు బాధితులు కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో అనంతపురం, à°•à°¡à°ª, కర్నూలు, గుంటూరు, కాకినాడ, విశాఖపట్టణం, తిరుపతి, శ్రీకాకుళం, మచిలీపట్నం, నెల్లూరులో నర్సింగ్‌ కాలేజీలున్నాయి. వీటిలో మొత్తం 153మంది బోధనా సిబ్బంది అవసరం కాగా మంజూరు పోస్టులు 30మాత్రమే ఉన్నాయి. మరో 123మంది డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. మంజూరు పోస్టులకే ప్రమోషన్లు వర్తిసాయి. ఉన్నత విద్యార్హతతో పాటు ఇతర అన్ని అర్హతలూ ఉన్నవారికి పదోన్నతులు ఇవ్వకుండా డీఎంఈలోని à°’à°• ఉన్నతాధికారి, ఆయన à°•à°¿à°‚à°¦ పనిచేసే మరో అధికారి ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెతుతున్నాయి.
 
తమకు కావాల్సిన వారికోసం ప్రమోషన్ల ప్రక్రియను ఏడాదైనా వాయిదా వేయడానికి సిద్ధపడుతున్నారని చెబుతున్నారు. మంజూరు పోస్టులు 30à°•à°¿ గాను 2018-19 ప్యానెల్‌ ప్రకారం భర్తీ చేసిన పోస్టులు 20మాత్రమే చూపుతున్నారు. మరో 10ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. దీనికోసం ప్యానెల్‌ సిద్ధమైనా కూడా అమలులో మాత్రం జాప్యం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు తమకు కావాల్సిన వారికోసం ఖాళీలను అలాగే కొనసాగిస్తున్నారనే విమర్శలున్నాయి. à°ˆ వ్యవహారంలో లక్షలు చేతులు మారినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. నర్సింగ్‌ ట్యూటర్‌ గ్రేడ్‌-2 పోస్టు కోసం పీహెచ్‌ఎన్‌ టీచింగ్‌, స్టాఫ్‌ నర్సులు అర్హులు. వారిలో ఎమ్మెస్సీ నర్సింగ్‌ ఉన్నవారికి ప్రమోషన్లలో ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. కానీ డీఎంఈ కార్యాలయంలో నిబంధనలు పాటించకపోవడంతో పలువురు ప్రమోషన్లలో వెనుకబడిపోతున్నట్టు తెలుస్తోంది. 2018-19 ప్యానల్‌ కోసం ప్రమోషన్ల తుది జాబితా సిద్ధం చేసి అందులోని 20మందిలో 11మందికి 2019 జనవరిలో ప్రమోషన్లిచ్చారు.
 
తక్కినవారికి ఇంకా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. ఏటా తయారుచేసే ప్యానల్‌ జాబితాను అనుసరించి సీనియారిటీ ఉన్నవారికి ప్రమోషన్లు ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. జీవో.230 ప్రకారం ఒకసారి ప్రమోషన్‌ పొందిన తర్వాత మరో మూడేళ్ల వరకూ వారికి మళ్లీ పదోన్నతి ఇవ్వడానికి వీల్లేదు. అయితే ప్రస్తుత జాబితాలో ప్రమోషన్లకు అన్ని అర్హతలున్న వారున్నా à°† ప్రక్రియను అమలు చేయకుండా ఉన్నతాధికారులు జాప్యం చేస్తున్నారని అర్హులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల కారణంగా తమకు ప్రమోషన్లలో అన్యాయం జరిగిందంటూ కొందరు బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.