12 గంటలకు ఎంసెట్ పరీక్షల ఫలితాలు విడుదల
Published: Wednesday May 02, 2018
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ పరీక్షల ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఈ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో విడుదల చేయబోతున్నారు. దీనికి సంబదించిన అన్ని ఏర్పట్లను అధికారులు పూర్తి చేసారు.

ఈ ఫలితాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్(www.sche.ap.gov.in)లో తెలుసుకోవచ్చు అని అలాగే ఫలితాలు విడుదల కాగానే మెసేజ్ రూపంలో అభ్యర్థుల మొబైల్ నంబర్లకు ర్యాంకులను పంపిస్తామని అధికారులు తెలియజేసారు. అలాగే ఎంసెట్ ఫలితాలు టీవీ తెరపై ప్రత్యక్షం కానున్నాయి. ఏపీ ఫైబర్‌నెట్, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలు ఎంసెట్ విద్యార్థుల కోసం ఈ మేరకు ఏర్పాట్లు చేశాయి.

Share this on your social network: