మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు

ఇంటర్మీడియెట్ పబ్లిక్(థియరీ) పరీక్షలు 2020 మార్చి 4 నుంచి 23 వరకు జరిగే అవకాశం ఉంది. మార్చి 4న ప్రథమ, 5న ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రారంభం కానున్నాయని సమాచారం. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్ష అంతకు ముందుగా నే అంటే.. జనవరి 28న, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీ క్ష 30న, ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు ని ర్వహించే అవకాశం ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం 2020 సాధారణ సెలవులను ఇంకా ప్రకటించలేదు. ఇది ప్రకటించిన తర్వాతే పరీక్షల టైమ్ టేబుల్‌ను ఇంటర్‌బోర్డు అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇక, తెలంగాణలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 4న ప్రారంభమయ్యేలా ప్రభుత్వం శుక్రవారం టైమ్ టేబుల్‌ను విడుదల చేసింది. ఏపీలోనూ ఇదే టైమ్‌టేబుల్‌ను ప్రకటించేలా చూడాలని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి శుక్రవారం రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ద్వారా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురే్‌షను కోరినట్లు తెలిసింది.

Share this on your social network: