నేటి నుంచి ఏపీ టెట్‌

Published: Sunday June 10, 2018


ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) ఆదివారం నుంచి ఈ నెల 19 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరీక్షలకు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ర్టాల అభ్యర్థుల కూడా పోటీ పడుతున్నారని తెలిపారు. మొత్తం 3,97,957 మంది దరఖాస్తు చేసుకొన్నారని, వారి కోసం 113 పరీక్షా కేంద్రాలు కేటాయించామన్నారు. రోజూ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తొలి సెషన్‌, తిరిగి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5గంటల వరకూ రెండో సెషన్‌ పరీక్ష ఉంటుంది.
 
పరీక్ష ముగిసిన వెంటనే కంప్యూటర్‌ స్ర్కీన్‌పై సుమారుగా మార్కులు తెలిసిపోయేలా ఏర్పాట్లు చేశామని గంట్రా చెప్పారు. సందేహాలు 9505619127, 9505780616, 9505853627 నంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు.