ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల: 7వ ర్యాంక్ లో నిలిచిన విశాఖ యువకుడు
Published: Sunday June 10, 2018

న్యూఢిల్లీ: ఐఐటీ, జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఫలితాలను సీబీఎస్‌ఈ వెబ్‌సైట్(https://results.jeeadv.ac.in )లో అందుబాటులో ఉంచారు. ప్రణవ్ గోయల్, మీనాలాల్ పరాఖ్‌లు ఈ ఫలితాల్లో టాపర్‌గా నిలిచాడు.
కాగా, విశాఖపట్నంకు చెందిన హేమంత్‌కు ఏడో ర్యాంకు సాధించాడు. దేశవ్యాప్తంగా మే 20న ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రవేశపరీక్ష జరిగింది. దీనికి రెండు లక్షల మంది హాజరయ్యారు. వారిలో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు 30 వేల మంది ఉన్నారు.
ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశాల కోసం జూన్ 15 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించాలని జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) బోర్డు ఇప్పటికే నిర్ణయించింది. షెడ్యూల్ కూడా ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో 10,988 సీట్లు, 31 ఎన్‌ఐటీల్లో17,868 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Share this on your social network: