ఏపీ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల

Published: Tuesday June 12, 2018

 ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్నిఅమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 50 ఇంటర్‌ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి గంటా చెప్పారు.