దేశంలో ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలలివే..... చూడండి
Published: Wednesday June 13, 2018

దేశంలో జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ఫలితాల వెల్లడితో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల పర్వం ప్రారంభమైంది. ప్రతిష్ఠాత్మక ఐఐటీ,ఎన్ఐటీలలో ప్రవేశానికి దరఖాస్తుల పర్వం ఆరంభమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దేశంలోని ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలల జాబితాను ‘ఇండియా ర్యాంకింగ్ రిపోర్టు 2018’ పేరిట విడుదల చేసింది. ఇంజినీరింగ్ కళాశాలల నిర్వహణ, బోధన, అధ్యయనం, అందుబాటులో ఉన్న వనరులు, పరిశోధనల ప్రాతిపదికగా దేశంలో 2018వ సంవత్సరంలో 30 ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలల జాబితాలను ర్యాంకుల వారీగా విడుదల చేసింది. ఈ జాబితా ఇంజినీరింగ్ కోర్సులో చేరబోయే విద్యార్థుల ప్రయోజనార్థం ఈ దిగువ ఇస్తున్నాం.
దేశంలో టాప్ 30 ఇంజినీరింగ్ కళాశాలల జాబితా...
1. ఐఐటీ, మద్రాస్. 2. ఐఐటీ,బాంబే, 3.ఐఐటీ, ఢిల్లీ, 4. ఐఐటీ, ఖరగ్ పూర్, 5. ఐఐటీ,కాన్పూర్ 6. ఐఐటీ, రూర్కీ 7.ఐఐటీ, గౌహతి, 8. అన్నా యూనివర్శిటీ, చెన్నై, 9. ఐఐటీ, హైదరాబాద్ 10. ఐసీటీ, ముంబై, 11. ఎన్ఐటీ, తిరుచనాపల్లి, 12, జాదవ్ పూర్ యూనివర్శిటీ, కోల్ కతా, 13.ఐఐటీ,ధన్ బాద్, 14. ఐఐటీ, ఇండోర్, 15. ఎన్ఐటీ, రౌర్కెలా, 16.వీఐటీ, 17. బిట్స్, పిలానీ, 18 ఐఐటీ, భువనేశ్వర్, 19. ఐఐటీ, వారణాసి, 20. థాపర్ ఐఈటీ, పాటియాలా, 21. ఎన్ఐటీ, సూరత్ కల్, 22. ఐఐటీ,రోపార్, 23. ఐఐఎస్‌ఎస్‌టీ, తిరువనంతపురం, 24. ఐఐటీ, పాట్నా, 25. ఎన్ఐటీ,వరంగల్, 26. బీఐటీ, రాంచీ, 27. ఐఐటీ,గాంధీనగర్, 28. ఐఐటీ, మండీ, 29. పీఎస్జీ ఇంజినీరింగ్ కళాశాల, కోయంబత్తూర్, 30. ఐఐఈఎస్ టీ, షీబ్ పూర్ (హౌరా).

Share this on your social network: