సెప్టెంబర్ 12 న దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు

Published: Monday July 12, 2021

 దేశ వ్యాప్తంగా నీట్ -2021 పరీక్షలను సెప్టెంబర్ 12 న నిర్వహిస్తామని కేంద్రం సోమవారం ప్రకటించింది. అయితే పరీక్ష సమయంలో కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటిస్తామని కేంద్ర ఉన్నత విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తామని ఆయన పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 న నీట్ పరీక్ష జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదాపడింది.