ప్రకాశం వాసికి హైదరాబాద్‌ ఐఐటీ పీహెచ్‌డీ

Published: Monday August 06, 2018

ప్రతిభకు పేదరికం అడ్డురాలేదు. నిరుపేద కుటుంబంలో పుట్టినా... పట్టుదలగా చదివిన విద్యార్థి క్లిష్టమైన భౌతికశాస్త్రంలో హైదరాబాద్‌ ఐఐటీ నుంచి ఆదివారం డాక్టరేట్‌ (పీహెచ్‌à°¡à±€) అందుకున్నాడు. à°† విద్యార్థి పేరు కుమార్‌రాజా. ప్రకాశం జిల్లా చీరాల చినగంజాం మండలం గొనసపూడికి చెందిన కుమార్‌రాజాది పేద కుటుంబం. తండ్రి దేవానందం వ్యవసాయ కూలీ. తిమ్మసముద్రం ప్ర భుత్వ పాఠశాలలో హైస్కూల్‌ చదువు పూర్తి చేసిన కుమార్‌ గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్‌ కళాశాలలో ఇంటర్‌ చదివాడు. అనంతరం ఖరగ్‌పూర్‌ ఐఐటీలో బీటెక్‌తో పాటు ఎంటెక్‌ పూర్తి చేశాడు. ఆపై హైదరాబాద్‌ ఐఐటీలో భౌతికశాస్త్రంలో ఫెర్రో ఎలక్ర్టికల్‌ మెటీరియల్స్‌పై పరిశోధనలు చేశాడు. ఆదివారం ఇక్కడ జరిగిన స్నాతకోత్సవంలో పీహెచ్‌à°¡à±€ పట్టా అందుకున్నాడు. కొడుకు సాధించిన విజయం చూసి దేవానందం హృదయం ఉప్పొంగింది. కుమార్‌ పీహెచ్‌à°¡à±€ పట్టా అందుకోవడంతో ఇన్నాళ్లూ తాను పడిన శ్రమ మర్చిపోయానని దేవానందం చెమర్చిన కళ్లతో చెప్పాడు. కాగా.. తన ప్రయత్నం ఇక్కడితో ఆగదని, మరింత ఉన్నత చదువుల కోసం అమెరికా లేదా చైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని à°ˆ సందర్భంగా కుమార్‌రాజా తెలిపాడు.