వైద్యుల నియామకాలకు భారీగా అప్లికేషన్లు

Published: Wednesday November 21, 2018
వైద్యుల నియామకాలకు భారీగా అప్లికేషన్లు విడుదల చేసింది ప్రబుత్వం. ఇందుకుగాను... 11,595 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో డీహెచ్‌ పరిధిలోని 1071 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (సీఏఎస్‌) పోస్టులకు 6545 దరఖాస్తులు వచ్చాయి. అధికారులు ప్రస్తుతం వీటిని పరిశీలించే పనిలో ఉన్నారు. మరోవైపు వైద్య విధాన్‌ పరిషత్‌ పరిధిలో సుమారు 150 స్పెషలిస్ట్‌ (గైనిక్‌, పీడీయాట్రిక్‌, అనస్తీషియా) పోస్టులకు 350లకుపైగా, కేవలం 35 డెంటల్‌ డాక్టర్‌ పోస్టులకు 3500 దరఖాస్తులు వచ్చాయి. ఆరోగ్యశాఖలో అత్యధిక దరఖాస్తులు డెంటల్‌ పోస్టులకే రావడం విశేషం. ఇక డీఎంఈలో 280 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 1400 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 23వ తేదీ తర్వాత డీఎంఈ అధికారులు వీటిని పరిశీలించనున్నట్లు సమాచారం. కాగా, నియామక ప్రక్రియ అంతా పారదర్శకంగా జరుగుతుందని ఆరోగ్యశాఖ తెలిపింది.