జనసైనికులు మృతి..!

Published: Monday December 03, 2018
అనంతపురంలో ఆదివారం జరిగిన జనసేన కవాతుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో కర్నూలు జిల్లాకు చెందిన నలుగురు మృతిచెందారు. డోన్‌ హైవే యు.కొత్తపల్లి టర్నింగ్‌ కాటా వద్ద జన సైనికులు ప్రయాణిస్తున్న కారును ఓల్వా బస్సు ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న హనుమన్న (28), మధు (28), ధర్మవరం మధు (28), గోవర్ధనగిరి మౌలాలి (27) అక్కడికక్కడే మృతి చెందారు. ఆదివారం రాత్రి సుమారు 10 à°—à°‚à°Ÿà°² సమయంలో à°ˆ ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్‌ మల్లికార్జున తీవ్రంగా గాయపడ్డారు. అనంతపురం జిల్లాలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏడురోజులపాటు పర్యటిస్తున్నారు. అందులో భాగంగా నిర్వహిస్తున్న కవాతుకు డోన్‌ నియోజకవర్గం నుంచి జనసేన కార్యకర్తలు తరలివెళ్లారు. వెల్దుర్తి మండలంలోని గోవర్ధనగిరి గ్రామానికి చెందిన హనుమన్న, గోవిందు, మధు డోన్‌కు వచ్చారు. డోన్‌ మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన మధు కూడా పట్టణానికి వచ్చారు. వీరంతా కలిసి అనంతపురం వెళ్లేందుకు అద్దె వాహనాన్ని మాట్లాడుకున్నారు. అనంతపురంలో జనసేన కవాతును చూసుకొని తిరిగి డోన్‌కు బయలుదేరారు. హైవేలోని యూ.కొత్తపల్లి కాటా టర్నింగ్‌ వద్ద కారును పట్టణ రహదారి మార్గంలోకి తిప్పారు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి బెంగలూరు వెళ్తున్న ఓల్వా బస్సు వేగంగా వచ్చి ఢీకొంది.
 
    రెప్పపాటులో ఘోర ప్రమాదం జరిగిపోయింది. దీంతో కారు పది అడుగుల దూరంలో à°Žà°—à°¿à°°à°¿ పడింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. డ్రైవర్‌ మల్లికార్జున కూడా తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న డోన్‌ పట్టణ సీఐ వెంకటరమణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరిన వేగమే నాలుగు నిండు ప్రాణాలను బలితీసుకున్నట్లు భావిస్తున్నారు. à°ˆ ఘటనతో జనసేన కార్యకర్తల్లో తీవ్ర విషాదం నెలకొంది.