బడి వయసులో బలవంతంగా బోటులోకి..

Published: Wednesday December 05, 2018
జాలర్లకు కడలి తల్లి.. à°Žà°‚à°¤ కష్టం వచ్చినా తీరం వదలరు. గంగమ్మకు మొక్కి అలలపై పడవలేస్తారు. à°† అమ్మను తలుచుకొన్నతర్వాతే వేటచేసిన చేపలను తూకం వేస్తారు. అలాంటి కడలి తల్లి బిడ్డలు.. గుజరాతీ వ్యాపారుల ధన దాహానికి తమ సొంత బిడ్డలకే దూరం అయిపోతున్నారు. గుజరాత్‌లోని వీరావల్‌ ఫిషింగ్‌ హార్బర్‌లో ఎక్కడ చూసినా ఉత్తరాంధ్ర నుంచి తరలించిన పిల్లలే కనిపిస్తారు. గుజరాతీ చేపల వ్యాపారులు, బోటు ఏజెంట్లు ఉత్తరాంధ్రలోని మత్స్యకార గ్రామాలకు ఏటా జూన్‌, జులైలో వస్తారు. గుట్టుచప్పుడు కాకుండా గ్రామాల్లో పర్యటిస్తారు. పిల్లలున్న కుటుంబాలను కలుసుకొంటారు. పిల్లలను గుజరాత్‌ పంపితే మంచి జీతం వస్తుందని, బాగా పనిచేస్తే పెద్దయ్యాక బోటు పనిమొత్తం అప్పగిస్తామని నమ్మబలుకుతారు. తండ్రి ఎలాగూ తమ బోటులోనే పనిచేస్తున్నాడు కాబట్టి, కొడుకును కూడా పంపితే ఇద్దరూ కలిసి ఉంటారని.. కుటుంబానికి ఆదాయం పెంచుతారంటూ లోబర్చుకుంటారు. కాదు.. తమ పిల్లలను బడికే పంపుతామంటే.. అడ్వాన్సు పేరిట రూ. 40-50 వేలు చేతిలో పెట్టి నోరు మూయిస్తారు.
 
వీరావల్‌ ఫిషింగ్‌ హార్బర్‌లో సుమారుగా 9,000 వేల వరకు ఇంజిన్‌ బోట్లు ఉన్నాయి. దాదాపు ఏడాదంతా అవి సముద్రంలోనే ఉంటాయి. à°ˆ బోట్లపై వెళ్లి చేపలు పట్టడం, నిల్వ చేయడం వంటి పనుల దగ్గర నుంచి కలాసీల వరకు విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన 25 వేలమందికిపైగా పనిచేస్తున్నారు. వీళ్లలో పెద్దలకు సరి సమానంగా పిల్లలు ఉన్నారు. అరేబియాలో సముద్రంలోకి ఇంజిన్‌బోట్‌ వేటకు వెళ్తే 20 నుంచి 25 రోజుల వరకు వెనక్కు రాదు. à°ˆ బోట్లు మహారాష్ట్ర, కేరళ, గోవా తదితర రాష్ట్రాల పరిధిలోని సముద్ర జలాల్లో వేట సాగిస్తాయి. à°ˆ క్రమంలో ఇతర దేశాల సముద్ర జలాల సరిహద్దుల వరకు వెళ్తాయి. ఇంత ప్రమాదకర, సుదీర్ఘ యాత్రలు చేయడానికి ఎక్కువమంది ముందుకు రారు. అందుకనే పిల్లలను ఎంచుకొంటున్నారు. వారయితే ఎదురుచెప్పరు. చెప్పిన పని చెప్పినట్టు చేస్తారని వ్యాపారుల ఆలోచన. ఉదయాన్నే గిన్నెలు శుభ్రం చేయడంతో వీరి దినచర్య మొదలవుతుంది.
 
à°† తరువాత అందరికీ వంట చేస్తారు. అనంతరం వారిని సముద్రంలో వేసిన వలను పైకి లాగడానికి పురమాయిస్తారు. వలలో పడ్డ చేపలను బయటకు తీయడం, ఐస్‌బాక్సుల్లో ఉంచి నిల్వ చేయడమూ వారి పనే. బోటు హార్బర్‌కు చేరుకున్న తర్వాత దాన్ని పూర్తిగా శుభ్రం చేయడం, నీళ్లు తోడడం వంటి పనులన్నీ అలుపెరగకుండా చేయించుకుంటారు. బడలిక సాంతం తీరకముందే.. రెండుమూడు రోజులకే మళ్లీ సముద్రంలోకి తరుముతారు. పాకిస్థాన్‌ అదుపులోకి తీసుకున్న మత్స్యకారుల్లో ఏడుగురు మైనర్లే ఉన్నారు. వీరిలో కల్యాణ్‌ (17), కిశోర్‌ (16) సొంత అన్నదమ్ములు. వీరిది శ్రీకాకుళం జిల్లా దిబ్బల మత్స్యలేశం ప్రాంతం. కల్యాణ్‌ పదోతరగతి ఫస్ట్‌క్లాసులో ఉత్తీర్ణుడయ్యాడు. సూరాడ మగతమ్మకు గుజరాత్‌ సేఠ్‌లు కొంత ముట్టజెప్పి కల్యాణ్‌, కిశోర్‌లను తమ వెంట తీసుకెళ్లారు. వారి తండ్రి కూడా వీరావల్‌ హార్బర్‌లోనే పనిచేస్తున్నాడు.