చనిపోయినా సమాచారమివ్వరు ఒడ్డునే గుంట తీసి పూడ్చేస్తారు

Published: Friday December 07, 2018
 à°¤à±€à°°à°‚లో అడుగులు వేసే వయసు నుంచి, లోపలకు వెళ్లి వేట చేసేదాకా, జాలరి కుటుంబాలకు సముద్రంతోనే లింకు! ఆట, సయ్యాట దానితోనే. కల్లోలాల్లో, సుడిగుండాల్లో గల్లంతయినవారిని సముద్రం జాగ్రత్తగా ఒడ్డుకు చేరుస్తుంది. ప్రాణాలు పోగొట్టుకున్నవారిని వారి రక్తబంధువులకు భద్రంగా అప్పగిస్తుంది. సముద్రాన్ని నమ్ముకొన్నవారు బతుకులోనే కాదు.. చావులోనూ అనాథలు కాబోరు. కానీ, గుజరాత్‌ వ్యాపారుల అదుపులో బోటు వేట చేస్తున్న మన రాష్ట్ర జాలర్లు మాత్రం, పోవడమేగానీ తిరిగి రావడం ఉండదు. సముద్రంలో ప్రమాదానికి గురయి చనిపోతే.. కన్నవారికి కడచూపునకు కూడా మిగలరు. కనీసం à°† సమాచారం ఇక్కడివారికి బోటు యజమానులు ఇవ్వరు. తీరంలోనే గుంట తీసి పూడ్చిపెట్టేస్తున్నారు. ఒకవేళ సమాచారం ఇచ్చినా.. అంతదూరం పోయి తమవారి మృతదేహాలను తెచ్చుకొనే స్థోమత కుటుంబాలకు ఉండదు. పోయి రావడానికే రూ.50వేలు అవుతుంది.
 
 
à°…à°‚à°¤ మొత్తం ఖర్చు పెట్టుకోలేక చాలా కుటుంబాలు.. తమవారిని తెచ్చుకోడానికి ముందుకు రాలేకపోతున్నాయి. ఎనిమిది నెలల కాంట్రాక్టు మీద ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జాలర్లను సేఠ్‌లు, దళారులు తమ వెంట గుజరాత్‌కు తీసుకెళతారు. à°† గడువు ముగిసేదాకా, అక్కడి వారి బాగోగులు ఇక్కడివారికి, ఇక్కడివారి ఇబ్బందులు అక్కడివారికి తెలియనీయరు. బోటు పనిచేస్తూ జబ్బుపడితే.. తూతూమంత్రంగా కొంత వైద్యం చేయిస్తారు. à°ˆ క్రమంలో చనిపోతే కొంత డబ్బు ఖర్చుపెట్టి వారికి అక్కడే సేఠ్‌లు అంత్యక్రియలు జరిపిస్తారు. ఇలా విజయనగరం జిల్లాకు చెందిన ఐదుగురు మత్స్యకారులను అనాథల్లా అక్కడే పూడ్చిపెట్టారు. à°ˆ జిల్లాలోని తీర మండలాలైన పూసపాటిరేగ, భోగాపురం నుంచి వేల సంఖ్యలో జాలర్లు గుజరాత్‌లోని వీరావల్‌ ఫిషింగ్‌ హార్బర్‌లో పనిచేస్తున్నారు. విజయనగరం జిల్లా సహా ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు ఏటా ఏప్రిల్‌-జూన్‌ మధ్యకాలంలో గుజరాత్‌ సేఠ్‌లు దిగుతారు.
 
 
తమ బోట్లపై పనిచేయడానికి రావాల్సిందిగా జాలరి కుటుంబాలను కలుసుకొంటారు. అందుకు ముందుకొచ్చిన వారితో ఎనిమిది నెలల(ఆగస్టు-ఏప్రిల్‌) కాలానికి కాంట్రాక్టు కుదుర్చుకొంటారు. ఒక్కో జాలరి కుటుంబానికి రూ.45 నుంచి రూ.50 వేలు దాకా చేతిలో పెడతారు. కానీ, కాంట్రాక్టు గడువు ముగిసేదాకా జాలర్లకు దినమొక à°—à°‚à°¡à°‚à°—à°¾ గడుస్తుంది. ప్రతి రోజూ చేపల వేటకు వెళ్లాలి. సెలవులు ఉండవు. బోటులో వలలు, పట్టిన చేపల మధ్యనే వారాలకు వారాలు గడపాలి. వెంట తీసుకెళ్లిన నీళ్లను 20నుంచి 25 రోజులు వాడుకోవాలి. దీంతో తాగునీటికి, స్నానాలకు ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల చాలా త్వరగా అంటువ్యాధులకు గురవుతున్నారు.