రాష్ట్ర అధికారులతో వలస మత్స్యకారులు

Published: Tuesday December 11, 2018

ఏపీకి చెందిన వలస మత్స్యకారుల జీవన స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ రాంశంకర్‌నాయక్‌ నేతృత్వంలోని 10 మంది సభ్యుల బృందం సోమవారం గుజరాత్‌లో పర్యటించింది. గుజరాత్‌లో చేపల వేటకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన 21 మంది పాకిస్థాన్‌ చెరలో ఉన్న విషయం తెలిసిందే. వారి విడుదలకు సకల ప్రయత్నాలూ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అసలు మత్స్యకారుల వలసకు కారణాలు తెలుసుకుని, వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే ఉద్దేశంతో à°ˆ కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు తొలి రోజు గుజరాత్‌లోని పోర్‌బందర్‌, మంగ్రోల్‌ హార్బర్లను సందర్శించి, అక్కడ ఉన్న శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల మత్స్యకారులతో మాట్లాడారు. చేపల వేట, ఆదాయం, ఆరోగ్య పరిస్థితి, సౌకర్యాలపై ఆరా తీశారు. ఏపీ నుంచి భారీ సంఖ్యలోనే వలస వచ్చినట్టు గుర్తించారు. ఏడాదిలో 8నెలలు చేపల వేట, నాలుగు నెలలు చేతి వృత్తులపై జీవిస్తున్నామని మత్స్యకారులు చెప్పారు. జూనియర్లకు నెలకు రూ.10వేలు, సీనియర్లకు రూ.16వేలు, బోటు డ్రైవర్‌కు రూ.30వేల వరకు ఇస్తారని తెలిపారు. కాంట్రాక్టర్లు ఉచితంగా భోజనం, వసతి కల్పించారని మత్స్యకారులు వివరించినట్టు రాంశంకర్‌నాయక్‌ ‘ఆంధ్రజ్యోతి’à°•à°¿ ఫోన్‌లో చెప్పారు. జెట్టీలు, పెద్ద బోట్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తే, ఏపీలోనే ఉంటామని తెలుగు మత్స్యకారులు చెప్పారన్నారు.