‘చంద్రన్న క్రిస్మస్‌ కానుక’ ఆగదు

Published: Thursday December 13, 2018
రేషన్‌ డీలర్ల సమ్మె ప్రకటన ఉత్కంఠ రేపుతోంది. à°ˆ నెల 20లోపు ‘చంద్రన్న క్రిస్మస్‌ కానుక’ లబ్ధిదారులకు చేరాల్సి ఉంది. మరోవైపు 16 నుంచి రేషన్‌ డీలర్లు సమ్మెలోకి వెళ్తామని ప్రకటించడంతో సమ్మెలోకి వెళ్లిన డీలర్ల స్థానంలో సరుకుల పంపిణీ బాధ్యతను స్వయం సహయక బృందాలకు అప్పగిస్తామని, చంద్రన్న కానుక పంపిణీ ఆగదని పౌరసరఫరాల కమిషనర్‌ పేర్కొన్నారు. ఇదిలావుంటే, డీలర్లకు బకాయి ఉన్న మధ్యాహ్న భోజన పథకం కమీషన్లను విడుదల చేశారు.