సూది నుంచి సీటీ స్కాన్‌ దాకా.. అన్ని ఉపకరణాల తయారీ జోన్‌

Published: Friday December 14, 2018
సూది నుంచి సీటీ స్కాన్‌ వరకు... వైద్యరంగానికి చెందిన అన్ని రకాల ఉపకరణాల తయారీకి ప్రత్యేకించిన ‘మెడ్‌టెక్‌ జోన్‌’ ప్రారంభమైంది. విశాఖలో ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి వైద్య ఉపకరణాల తయారీ సెజ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబేతో కలిసి జాతికి అంకితం చేశారు. à°ˆ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌à°“)తో కలిసి వైద్య పరికరాల తయారీపై ఏర్పాటు చేసిన ప్రపంచ స్థాయి సదస్సులో సీఎం ప్రసంగించారు. ఏపీ మెడికల్‌ టెక్నాలజీ పార్కు (ఏపీ మెడ్‌టెక్‌)ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘పేదలకు తక్కువ ధరలో ఆరోగ్య భాగ్యం అందాలి. నాణ్యమైన వైద్య పరికరాలు, కచ్చితమైన వ్యాధి నిర్ధారణ, పూర్తిస్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో à°ˆ పార్కును ఏర్పాటు చేశాం. దీనిని నెరవేర్చాలని కోరుతూ పార్కును జాతికి అంకితం చేస్తున్నాం’’ అని చంద్రబాబు తెలిపారు.
 
 
భారత్‌ ఏటా రూ.30 వేల కోట్ల విలువైన వైద్య పరికరాలను దిగుమతి చేసుకుంటోందని... à°ˆ నేపథ్యంలో దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేసే లక్ష్యంతో మెడ్‌టెక్‌ జోన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. à°ˆ సదస్సుకు 90 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇచ్చిన సలహాలతో పార్కును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య పరికరాల తయారీపై ఇప్పటికి మూడు సదస్సులు నిర్వహించిందని... భారత్‌లో నిర్వహించడం ఇదే మొదటిసారని తెలిపారు. మెడ్‌టెక్‌ జోన్‌కు 275 ఎకరాలు కేటాయించగా... మొదటి దశలో భాగంగా 80 ఎకరాల్లో కేవలం 342 రోజుల్లో 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు పూర్తి చేశారన్నారు. ఇదో రికార్డు అని తెలిపారు. రెండో దశను కూడా ఏడాదిలో పూర్తిచేస్తామన్నారు.