చరిత్రలో మొదటిసారి నిర్మాణం.. 2022 నాటికి ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు

Published: Friday December 21, 2018
సంక్షేమ పథకాల ఫలితాల ద్వారా నిరుపేద లబ్ధిదారుల కళ్లలో సంతృప్తి, వెలుగు చూడాలనేదే తన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం పట్టణ ప్రాంతాలకే 9.58 లక్షల ఇళ్లు మంజూరు చేశామని... మొత్తంగా 30 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఇంత భారీ సంఖ్యలో పేదలకు ఇళ్లు నిర్మించడం చరిత్రలోనే మొదటిసారని... ఇది తమ ప్రభుత్వానికే సాధ్యమైందని ప్రకటించారు. లబ్ధిదారులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకంజ వేస్తే... à°† బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుందన్నారు. 2022 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని వారెవరూ ఉండరాదని, దానికి బాధ్యత తానే తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. తిరుపతి రూరల్‌ మండలం పాడిపేటలో 3300 ఇళ్లతో నిర్మించిన బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.
 
à°ˆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘సొంత ఇల్లు ప్రతి ఒక్కరి à°•à°². దానిని నెరవేర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున పక్కా గృహాల నిర్మాణ పథకాలకు శ్రీకారం చుట్టాం. గ్రామీణ ప్రాంతాలకు 19.52 లక్షల గృహాలు మంజూరు చేశాం. గతంలో ఇంటికి రూ.20 వేలు మాత్రమే ఇచ్చేవారు. మా ప్రభుత్వం రూ.1.50 లక్షలు చెల్లిస్తోంది. గ్రామీణ పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.32,670 కోట్లు వెచ్చిస్తున్నాం. à°—à°¤ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అసంపూర్తిగా నిలిపివేసిన 4.40 లక్షల ఇళ్లను కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం’’ అని చంద్రబాబు వివరించారు. ఇక పట్టణ ప్రాంత పేదలకు ఎన్టీఆర్‌ హౌసింగ్‌ à°•à°¿à°‚à°¦ అపార్టుమెంట్ల తరహాలో 5.29 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. దీనికోసం రూ. 38,265 కోట్లు ఖర్చు చేస్తున్నామని... ఇవి కాకుండా వ్యక్తిగతంగా కూడా 4.25 లక్షల ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. ఒక్కోదానికి రూ.2.50 లక్షల చొప్పున ధర నిర్ణయించి... 13,086 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి వివరించారు.