సంక్రాంతి సమయంలో దొరకని టిక్కెట్లు

Published: Sunday December 23, 2018
విశాఖపట్నం: à°°à±ˆà°³à±à°²à°•à±‡ కాదు. విమానాలకూ డిమాండ్‌ పెరుగుతోంది. సంక్రాంతి సీజన్‌కు ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులపై దృష్టి పెట్టినా విమాన సంస్థలు మాత్రం à°† దిశగా ఎటువంటి ప్రయత్నాల చేయడం లేదు. దాంతో వున్న సర్వీసులకే డిమాండ్‌ అధికంగా ఉంది. ఉత్తరాంధ్రాకు చెందినవారు దేశ, విదేశాల్లో ఉన్నారు. వారిలో కొంతమంది సంక్రాంతికి స్వగ్రామాలకు వస్తారు. ఇప్పుడు అత్యధికులు కార్పొరేట్‌ కంపెనీల్లో బహుళ జాతి సంస్థల్లో పనిచేయడం వల్ల విమానాల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. చాలామంది అమెరికా, ఐరోపా దేశాల నుంచి హైదరాబాద్‌లో దిగి అక్కడి నుంచి విశాఖపట్నం వస్తారు. అలాగే బెంగళూరు, చెన్నై, ముంబై ప్రాంతాల్లో వున్నవారు సైతం విమానాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
 
 
ఎక్కువ మంది వచ్చే నెలలో సంక్రాంతికి వచ్చేందుకు 12à°µ తేదీని ఎంచుకుంటున్నారు. à°† రోజు శనివారం. 13 ఆదివారం. 14 భోగి, 15 సంక్రాంతి. వరుస సెలవులు. దాంతో 12à°µ తేదీ విమానాలకు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడింది. హైదరాబాద్‌ నుంచి విశాఖకు à°† రోజు టిక్కెట్‌ ఇండిగో సర్వీసుకు రూ.6,632 పలుకుతోంది. సాధారణ రోజుల్లో అందులో సగం ధరకే టిక్కెట్‌ లభిస్తుంది. డిమాండ్‌ వల్ల రేటు పెరిగిపోయింది. à°…à°‚à°¤ మొత్తం వెచ్చిద్దామన్నా ఇప్పుడు కొన్ని విమానాలకు టిక్కెట్లు దొరకడం లేదు. అలాగే బెంగళూరు, చెన్నై విమానాలకు రేటు పెరిగింది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సర్వీసులు నడపాలని, అవి రాత్రి ఏడు గంటలు దాటిన తరువాత అయితే బాగుంటుందని విమాన ప్రయాణికుల సంఘం ఉపాధ్యక్షులు à°¡à°¿.ఎ్‌à°¸.వర్మ, నరేశ్‌కుమార్‌లు విమాన సంస్థలను కోరారు.