మూడో రోజుకు చేరిన అగ్రిగోల్డ్‌ బాధితుల దీక్షలు

Published: Wednesday December 26, 2018
విజయవాడ: à°…గ్రిగోల్డ్‌ బాధితుల ఉద్య మానికి సమష్టి నాయకత్వం, దశలవారీ ఉద్యమ వ్యూహమే ఊపిరిగా నిలిచాయని, తుదివరకు ఐక్యంగా పోరాడితే చివరి రూపాయి వరకు బాధితులకు అందుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల డిమాండ్ల సాధన కోసం ధర్నాచౌక్‌లో బాధితులు, ఏజెంట్లు చేపట్టిన రిలే నిరాహారదీక్షలు మంగళవారం మూడో రోజుకు చేరాయి. దీక్షాశిబిరాన్ని à°…à°–à°¿à°² భారత కిసాన్‌సభ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, విశాలాంధ్ర దినపత్రిక సంపాదకుడు ముత్యాల ప్రసాద్‌, ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు ప్రారంభించారు.
 
అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షాశిబిరాన్ని సీపీఐ, ప్రజా సంఘాలు, ఏపీయూడబ్ల్యుజే నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. అసో సియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బి. విశ్వ నాథరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పలువురు ప్రసంగించారు. చివరి రూపాయి సాధనే లక్ష్యంగా బాధితులు ఉద్యమించాలని, వారికి తమ మద్దతు ఉంటుందని నేతలు హామీఇచ్చారు. à°ˆ సందర్భంగా అగ్రిగోల్డ్‌ యాజమాన్యం వైఖరిని దుయ్యబట్టారు.