‘మోదీ గో బ్యాక్‌’

Published: Thursday December 27, 2018
 à°ªà±à°°à°§à°¾à°¨à°¿ నరేంద్ర మోదీ గుంటూరు పర్యటనను వ్యతిరేకిస్తూ ‘మోదీ గో బ్యాక్‌’ నినాదంతో రెండు రోజులపాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని వామపక్ష పార్టీల కూటమి నిర్ణయించింది. విజయవాడ దాసరి భవన్‌లో బుధవారం 10 వామపక్ష పార్టీల ప్రతినిధులు ఆర్‌ఎ్‌సపీ నేత జానకి రాములు అధ్యక్షతన సమావేశమయ్యారు. జనవరి 5à°¨ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. 6à°µ తేదీన గుంటూరులో ‘మోడీ గో బ్యాక్‌’ నినాదంతో భారీ ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు.
 
కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 8, 9 తేదీల్లో కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సమావేశం నిర్ణయించింది. కరవు సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కరవు మండలాల్లో à°ˆ నెల 28à°¨ జరిగే ‘కరవు రైతుల బంద్‌’ను విజయవంతం చేయాలని కోరింది. అగ్రిగోల్డ్‌ బాధితుల దీక్షలకు మద్దతు ప్రకటించింది