జనవరి 6న తాటినీరా ఉత్పత్తులు

Published: Friday December 28, 2018

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో ఏర్పాటు చేసిన పరిశ్రమ నుంచి జనవరి 6à°¨ తాటి నీరా ఉత్పత్తులు ప్రారంభమవుతాయని రాష్ట్ర ఉద్యానవనశాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి తెలిపారు. తాటి చెట్ల నుంచి తీసే కల్లుకు ప్రత్యామ్నాయంగా తీసే తాటినీరాతో ప్రత్యేకించి బాట్లింగ్‌తోపాటు, బెల్లం, పంచదార, సిరప్‌ వంటి ఉత్పత్తులు తయారు చేస్తారని, దీనికి ఇటీవల అనుమతి మంజూరు చేశామని చెప్పారు. ఏజెన్సీలో à°’à°• రోజు పర్యటించిన ఆయన గురువారం మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఉద్యాన ఉత్పత్తుల ప్రోత్సాహం కోసం రూ.350 కోట్ల ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. సూక్ష్మ సేద్యానికి రూ.1500 కోట్ల బడ్జెట్‌ ఉందన్నారు. à°ˆ ఏడాది 6.1లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తి కావచ్చని అంచనా వేశారు. ధర కూడా బాగానే ఉంటుందన్నారు.