కారణం చెప్పని రాష్ట్ర బీజేపీ నేతలు

Published: Saturday December 29, 2018
 à°ªà±à°°à°§à°¾à°¨à°¿ మోదీ పర్యటన వాయిదా పడింది. ‘అనుకోకుండా వచ్చిన ముఖ్యమైన కార్యక్రమాల వల్లే రాష్ట్ర పర్యటనకు మోదీ రాలేకపోతున్నారు’ అని చెబుతున్నప్పటికీ... ఆయన తిరిగి ఎప్పుడు సీమాంధ్రకు వస్తారు, ఇప్పుడు పర్యటన వాయిదాకు కారణమేమిటో బీజేపీ రాష్ట్ర నేతలెవరూ అధికారికంగా చెప్పడంలేదు. ప్రస్తుతానికి ఆయన కార్యక్రమం రద్దయినట్లేనని, ఎన్నికల ప్రచారానికిగానీ రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ముందుగా ఖరారైన కార్యక్రమం ప్రకారం జనవరి 6à°¨ గుంటూరులో మోదీ బహిరంగ సభ జరగాల్సి ఉంది. టీడీపీతో కటీఫ్‌, కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వ యుద్ధం నేపథ్యంలో... ప్రధాని సభను బీజేపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ‘రాష్ట్రానికి మేం ఏం చేశామో మోదీ చెబుతారు. à°† తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మారిపోతుంది’ అని కూడా తెలిపారు.
 
మరోవైపు... మోదీ పర్యటనపై అధికార టీడీపీ, ఇతర పార్టీలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మోదీ క్షమాపణ చెప్పాకే రావాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ‘‘రాష్ట్రానికి తీరని అన్యాయంచేసి.. చచ్చామో బతికామో చూసేందుకు వస్తున్నారా?’’ అని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు, వామపక్షాలు, ప్రజా సంఘాలు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాయి. పరిస్థితులపై కేంద్ర నిఘా వర్గాలు ఆరా తీశాయి. భద్రతపై రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని, అయితే సభా ప్రాంగణంలో ప్రత్యేక హోదా కోసమో, ప్రధానికి వ్యతిరేకంగానో నినాదాలు చేసే అవకాశం ఉందని వారు చెప్పినట్లు సమాచారం. à°ˆ విషయాన్ని ఇతర మార్గాల్లో నిఘా వర్గాలు ధ్రువీకరించుకున్నాయి.
 
మొత్తానికి... వాతావరణం అనుకూలంగా లేదని, బహిరంగ సభలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యే అవకాశముందని ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మోదీ ఆంధ్రకు వెళ్లకుండా ఉంటేనే మంచిదన్న నిర్ణయానికి కేంద్ర పెద్దలు వచ్చారు. కాగా ప్రధాని మోదీ పర్యటన వాయిదా పడిందని, ఎప్పుడు జరిగేదీ త్వరలో ప్రకటిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో చెప్పారు.