మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే పాదయాత్ర

Published: Wednesday January 02, 2019
జనసేన పార్టీ మేనిఫెస్టోను, పార్టీ ఎన్నికల గుర్తు గాజుగ్లాస్‌ను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు పాదయాత్ర ప్రారంభించామని తూర్పుగోదావరి జిల్లా తునికి చెందిన జనసేన సైనికుడు శేషు అన్నారు. మంగళవారం ఇచ్ఛాపురం వచ్చిన శేషు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. à°ˆ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యా ణ్‌ మేనిఫెస్టోను ఆగస్ట్టు 14 à°¨ విడుదల చేశారని, తాను ఆగస్టు 16నుంచి సెప్టెంబరు 9 వరకు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తిరుపతి నుంచి తుని వరకు 800 à°•à°¿.మీ. పాదయాత్ర చేపట్టానన్నారు.
 
 
ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. పార్టీ గుర్తు గాజు గ్లాసును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గాజు గ్లాస్‌ను పాలతో నింపి కావిడలో పాల గ్లాసును పెట్టుకొని జనసేన పార్టీని గెలిపించే ఉద్దేశంతో ఇచ్ఛాపురం స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయం నుంచి మరలా పాదయాత్ర ప్రారంభించానని చెప్పారు. à°ˆ పాదయాత్ర తుని వరకు చేపడుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో ఇచ్ఛాపురం జనసేన ప్రతినిధులు దాసరి రాజు, దుర్యోధన, అఖిలసాయి, వల్లభ జానీ, మన్మథ రెడ్డి, మహేస్‌ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.