భారీ ఏర్పాట్లతో పందేలు

Published: Sunday January 06, 2019
సంక్రాంతి అంటే... ముగ్గులు, గొబ్బిళ్లు, కొత్త అల్లుళ్లు, సరదాలు, పల్లెల నిండా సందళ్లు! ఉభయ గోదావరి జిల్లాల్లో వీటికి అదనంగా కోడి పందేలు! ‘ఈసారి బరులు ఉంటాయా!’ అనే ప్రశ్న ప్రతిసారీ వినిపిస్తుంది. ఇప్పుడు మాత్రం ‘ఈసారి కచ్చితం à°—à°¾ బరులు ఉంటాయి’ అనే ధీమా కనిపిస్తోంది. కారణం... ఇది ఎన్నికల ఏడాది కావడమే! ఎన్నికల నేపథ్యంలో మరింత ఘనంగా కోడి పందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు సిద్ధమవుతుండగా... వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ ప్రధాన పార్టీల నాయకులు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే పందెం రాయుళ్లకు ఆహ్వానాలు వెళ్తున్నాయి.
 
ఈసారి తప్పదు మరి...: ‘‘సంక్రాంతి వస్తోంది. మనపార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు మన బరుల వద్దకు బాగా వస్తారు. అన్ని సదుపాయాలు కల్పించాలి. వచ్చే ఎన్నికల్లో మనకు ఇది కలిసొచ్చే అంశం’’ అంటూ పందెం రాయుళ్లు, స్థానిక నాయకులు కీలక నేతల దృష్టికి తీసుకెళ్తున్నారు. à°ˆ ఏడాది పందేలకు ఢోకా లే దని, ఐదు రోజుల జరుగుతాయనే సమాచారమూ బయటికి పొక్కింది. దీంతో పందెం రాయుళ్లలో ఉత్సాహం రెట్టింపు à°… య్యింది. ముఖ్యంగా టీడీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు నిర్వాహకులు కోడిపందేల బరుల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు చె ప్పేందుకు నాయకుల ఇళ్లకు వెళ్లిన నిర్వాహకులు.. పందేలపై డీల్‌ సెట్‌ చేసుకున్నారు. à°’à°• ఎమ్మెల్యే తన నియోజకవర్గ పరిధిలో బరులు నిర్వహించే వారితో భేటీ అయి రేట్లు మాట్లాడుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు... కోనసీమలోని అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, గన్నవరం, కొత్తపేటల్లో ఇప్పటికే కోడిపందేలు ప్రారంభం కావడం విశేషం.
 
ఇక.. పండగ సమీపించేసరికి భారీ బరులు సిద్ధమవుతాయి. ముఖ్యంగా మురమళ్ల, గోడి, గోడిలంక, సాకుర్రు, మలికిపురం మండలం వీవీ మెరక తదితర ప్రాంతాల్లో పెద్ద బరులు నిర్వహించనున్నారు. ఇప్పటికే అమలాపురం రూరల్‌ మండలం కామనగరువు, ఉప్పలగుప్తం మండలం ఎన్‌.కొత్తపల్లి, అల్లవరం, మామిడికుదురు మండలాల్లో పందెం పుంజులు పెంపక కేంద్రాలు పుంజులతో కళకళలాడిపోతున్నాయి. భారీసంఖ్యలో ఇక్కడ కోడి పందెంపుంజులను కొనుగోలు చేసుకునేందుకు పందేలు కాసే వ్యక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలివస్తున్నారు. ఒక్కొక్క పుంజు ఖరీదు రూ.3 వేల నుంచి రూ.5 వేలపైనే ధర పలుకుతోంది. ఇక... సంక్రాంతి సంబరాల కు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్న లాడ్జిలన్నీ పండుగ మూడు రోజులు హౌస్‌ఫుల్‌ అయ్యాయి. చిన్నస్థాయి లాడ్జిల నుంచి... కొత్తగా ప్రారంభించబోయే హోటళ్లలోనూ గదులను బుక్‌ చేసేసుకున్నారు.