జోరుగా పందేలు.. కోట్లలో చేతులు మారిన ధనం

Published: Wednesday January 16, 2019
కోడి చెలరేగిపోయింది. రాష్ట్రమంతా పరుచుకొన్న పందెపు బరుల్లో కాలు దువ్వింది. ఎన్నికల ఏడాది కావడం, అధికారులు, పోలీసులు కూడా à°’à°•à°¿à°‚à°¤ చూసీచూడనట్టు వదిలేయడంతో పండగ తొలిరోజు ఉత్సాహమంతా ఒక్కచోటే చేరిందా అన్నట్టు..దుమ్ము రేగిపోయింది. భోగి మంటల సిరి బరిలో మురిసింది. పుంజులు పురివిప్పి విజృంభిస్తుంటే, పందెం ప్రియులు పరవశించిపోయారు. గెలిచిన పక్షం కేరింతలూ, à°“à°¡à°¿à°¨ వారి నిట్టూర్పులతో వింత వాతావరణం అంతటా కనిపించింది. à°’à°• చేత్తో కోళ్లను, మరో చేత్తో కరెన్సీని గాలిలోకి ఊపుతూ, పందెం రాయుళ్లు సందడి చేస్తే, పేక ముక్కలు తిప్పి జూదం ప్రియులు ‘షో’ను రక్తి కట్టించారు. కోట్లలో కట్టలు తెగగా, బరులు వద్ద బేరాలు జోరుగా సాగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సోమవారం దాదాపు 400లకు పైగా బరుల్లో భోగి పండగ à°•à°³ కట్టింది. ఒక్కో నియోజకవర్గంలో పదుల సంఖ్యలో బరులు వెలిశాయి. భీమవరం పరిసరాల్లో కోడి పందేల్లో గరిష్ఠంగా లక్షన్నర నుంచి నాలుగు లక్షల వరకు పందేలకు దిగిన వారు ఉన్నారు. చిన్నచిన్న బరుల్లో 10 నుంచి 50 వేల వరకు పందేలు కాశారు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఒక్కో ఆట ఐదు లక్షల రూపాయల వరకు చేరింది.
 
 
తొలి రోజే కోట్లు చేతులు మారాయి. ఆకివీడు మండలంలో కోడి పందేలుపై మొదటి రోజు రూ.5 కోట్లపైనే టర్నోవరు జరిగినట్లు అంచనా. ఒక్కొక్క బరిలో రూ.10 లక్షలు వరకు కోడి పందెం కాశారు. మొదటిరోజు కోడి పందేలలో డేగ నెమలి à°°à°•à°‚ పుంజులు దుమ్ము దులిపాయి. పందేలలో సింహభాగం à°ˆ à°°à°•à°‚ పుంజులు పందేలు గెలిచాయి. పందెంలో చనిపోయిన, ఓడిపోయిన పుంజును కోజా అంటారు. కోజాకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం పందేలలో కోజా రూ.10 వేలపైన ధర పలుకుతున్నది. సాయంత్రం దాటి.. చీకటి పడుతున్నా చాలా బరుల వద్ద ఉత్సాహం తగ్గలేదు. ఫ్లడ్‌లైట్ల వెలుగులోనే రాత్రి పొద్దుపోయేవరకు తలపడ్డారు. ఇలా ఒక్కో బరిలో సరాసరిన 50 వరకు పందేలు సాగాయి. కాగా, అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా బరులకు దూరంగా ఉన్నారు. ఏ ఒక్కరూ పందేల వద్ద కనిపించలేదు. తమ పరోక్షంగా కార్యకర్తలను పురమాయించి ప్రజల అవసరాలను తీర్చారు. ఇక.. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీల వారీగా, కులాల వారీగా ఈసారి బరులు వెలిశాయి. à°† బరుల వద్ద రికార్డిండ్‌ డ్యాన్సులు రాత్రంతా జోరుగా సాగాయి. à°ˆ జిల్లాలో వందకు పైగా ఏర్పాటుచేశారు. తొలిరోజు రూ.12-15 కోట్ల మధ్య చేతులు మారినట్టు సమాచారం.
 
 
ఇదిలాఉండగా కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలోని కొడాలి సెంటర్‌కు సమీపంలో ఉన్న పంట పొలాల్లో కోడిపందాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. సుమారు నాలుగెకరాల మాగాణి పొలంలో చుట్టూ ఫెన్సింగ్‌ వేసి మరీ కోడిపందాలు నిర్వహిస్తున్నారు. కలిదిండి మండలంలోని కలిదిండి, సానారుద్రవరం, పడమటిపాలెం గ్రామాల్లో సోమవారం జోరుగా కోడిపందాలను నిర్వహించారు. చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి పందేపు రాయుళ్లు ఖరీదైన కార్లలో తరలివచ్చారు. ఒక్కో కోడి పందేం రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వేశారు. పైపందేలు కూడా జోరుగా సాగాయి. ఇక్కడ పందెపు రాయుళ్ల రక్షణకు బౌన్సర్లను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నం రూరల్‌ పరిధిలోని మేకావానిపాలెం, గోపువానిపాలెం, మంగినపూడి, కానూరు, పోలాటితిప్ప, కోన తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున బరుల వెలిశాయి. చందర్లపాడు గ్రామంలో టీడీపీ. వైసీపీ నాయకులు వేర్వేరుగా బరులు ఏర్పాటు చేశారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు, గండ్రాయి, జగ్గయ్యపేట ప్రాంతాల్లో భారీగా పందేలు జరుగుతున్నాయి.