అట్టహాసంగా మొదలైన బెలూన్‌ ఫెస్టివల్‌..

Published: Saturday January 19, 2019

ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయలో సరికొత్త అందాలు ఆవిష్కృతమయ్యాయి. నీలిమేఘాల మధ్య రంగుల రంగుల బెలూన్లు సందడి చేశాయి. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో అరకులోయలో మూడు రోజుల బెలూన్‌ ఫెస్టివల్‌ శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక ఎన్‌టీఆర్‌ క్రీడా మైదానంలో ఉదయం పది గంటలకు హాట్‌ఎయిర్‌ బెలూన్లను గాలిలోకి ఎగురవేశారు. 15 దేశాల నుంచి వచ్చిన పైలట్లు సందర్శకుల కేరింతల నడుమ à°’à°•à°°à°¿ తర్వాత ఒకరుగా తమ బెలూన్లతో గాలిలోకి ఎగిరారు. అరకులోయకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంతో పాటు దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు à°ˆ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నామని ప్రారంభోత్సవ సభలో ఏపీటీడీసీ à°Žà°‚à°¡à±€ హిమాంశ్‌ శుక్లా తెలిపారు.