ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా పెట్టుబడుల వేట

Published: Sunday January 20, 2019

దావోస్‌లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు ఐటీశాఖ మంత్రి లోకేశ్‌ బృందం వెళ్లనుంది. సోమవారం బయల్దేరి వెళ్లి 24వ తేదీవరకు దావోస్‌ వేదికగా పెట్టుబడుల వేట సాగించనుంది. పలు ప్రఖ్యాత కంపెనీల సీఈవోలు, చైర్మన్లతో మంత్రి భేటీ అవుతారు. పలు కీలక అంశాలపై దావోస్‌ వేదికపై ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దావో్‌సకు వెళ్లాలని తొలుత అనుకున్నారు. అయితే, రాజకీయంగా బిజీ కావడం, గణతంత్ర ఉత్సవాలు ఉండడం తదితర కారణాలతో ఆయన రద్దుచేసుకున్నారు. కాండ్యుయెంట్‌, టీసీఎల్‌, అదానీ డేటాపార్క్‌, రిలయన్స్‌ జియో, ఫ్లెక్స్‌ట్రానిక్స్‌ వంటి ప్రఖ్యాత కంపెనీలు లోకేశ్‌ చొరవతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. డిక్సన్‌, ఫాక్స్‌కాన్‌, సెల్‌కాన్‌ లాంటి సంస్థల్ని రాష్ట్రానికి రప్పించడంలో కీలకపాత్ర పోషించారు. వీటన్నింటి దృష్ట్యా దావోస్‌ వెళ్లే బృందానికి సారథ్యం వహించే బాధ్యతను లోకేశ్‌కు అప్పగించారు. ఈ బృందం దావో్‌సలో డెలాయిట్‌, ప్ర్టోర్‌ అండ్‌ గేంబుల్‌, విప్రో, పెగా సిస్టమ్స్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌, నెస్లే, ఏటీ అండ్‌ టీ, ఇన్వోస్కో కంపెనీల ప్రతినిధులతో భేటీ కానుంది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలు, ఇస్తున్న రాయితీలు ఆయా కంపెనీల ప్రతినిధులకు బృందం సభ్యులు వివరించనున్నారు. లోకేశ్‌ బృందం దావో్‌సలో అడుగుపెట్టేనాటికి అక్కడ మైనస్‌ 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసిం ది. ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో రోజుకు దా దాపు 15గంటలకు పైగా సాగే వివిధ సమావేశాల్లో ఈ బృం దం పాల్గొననుంది. ఈ బృందంలో వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, వ్యవసాయ రంగ ప్రభు త్వ సలహాదారు విజయకుమార్‌, ఇంధనం, మౌలిక, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌, ఏపీఈడీబీ సీఈవో జాస్తి కృష్ణకిషోర్‌, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఆరోఖియారాజ్‌, ఏపీఐఐసీ ఎండీ అహ్మద్‌బాబు, సమాచార శాఖ కార్యదర్శి రామాంజనేయులు, ఐటీ ఓఎస్డీ కిరణ్‌ గుత్తా, ఐటీ జీఎం శ్రీనివాస్‌ తదితరులు ఉంటారు. 21న లోకేశ్‌ బృందం దావోస్‌ చేరుకొంటుంది. 22న డెలాయిట్‌, ప్ర్టోర్‌ అండ్‌ గేంబుల్‌, విప్రో, పెగా సిస్టమ్స్‌ తదితర మెగా కంపెనీల అధినేతలతో భేటీ అవుతుంది. 23న ఎజైల్‌ గవర్నెన్స్‌, డిజిటల్‌ గవర్నెన్స్‌, ఇండియా 4.0 అంశాలపై లోకేశ్‌ కీలకోపన్యాసం చేస్తారు. 24న సస్టెయినబుల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ తదితర అంశాలపై చర్చలు జరుపుతారు.