ఎంత నాయకుడైనా ఒకటే

Published: Tuesday January 22, 2019
 à°¨à±‡à°¨à±‡ ప్రజలతో మమేకమయ్యే నేతలను మాత్రమే ప్రమోట్‌ చేస్తా. à°Žà°‚à°¤ నాయకుడైనా పరిస్థితి బాగోలేకపోతే ఏమీ చేయలేను’ à°…ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లానేతలపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం జిల్లావారీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రారంభంలోనే చంద్రబాబు అసహనానికి గురయ్యారు ‘రాజధాని జిల్లాలో నేతలు ఎలా ఉండాలి.. కానీ మీ పనితీరు చూస్తుంటే బాధేస్తుంది. సీనియర్లమనే ధీమా బాగా పెరింగింది. à°…à°‚à°¤ ధీమా ఉన్న నేతలు రాష్ట్రంలో ఎక్కడా లేరు. మొన్న సత్తెనపల్లి సభలో ప్రజలను చూస్తే ఉత్సాహం పెరిగింది.. à°† ఉత్సాహం మీలో లేదు. మీటింగ్‌లకు పూర్తిగా హాజరు కారు... పార్టీ పని సక్రమంగా చేస్తానని ప్రమాణం తీసుకున్న తరువాతే సీట్లు ఇవ్వాల్సి పరిస్థితి’ అంటూ మండిపడ్డారు. పార్టీ ఆదేశాల మేరకు పనిచేయాలన్నారు.
 
దేశంలో.. రాష్ట్రం 11శాతం అభివృద్ధి రేటు సాధించిందన్నారు. రాజధాని పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. పోలవరం కాంక్రీట్‌ పనుల్లో రికార్డు సృష్టించామన్నారు. కోల్‌కతాలో జరిగిన మహాకూటమి బహిరంగ సభ విజయవంతమైందన్నారు. దేశ ప్రజలపై బీజేపీ ప్రభుత్వం రూ.82లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని ఆరోపించారు. నేతలు ప్రజలతో మమేకం కావాలన్నారు. ప్రజల ఆమోదయోగయంగా పనిచేయాలన్నారు. ఎమ్మెల్యే నరేంద్రకుమార్‌, శ్రావణ్‌కుమార్‌, థోచర్‌, సత్యప్రసాద్‌, మాణిక్యవరప్రసాద్‌ పాల్గొన్నారు.