వేగంగా పనిచేసే సర్కారు, అధికారులున్న రాష్ట్రమది

Published: Wednesday January 23, 2019
‘ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్‌ పెట్టాలని నిర్ణయించాక చాలా ఫోన్లు వచ్చాయి. ‘à°† రాష్ట్రాన్నే ఎందుకు ఎంచుకున్నారు? మా రాష్ట్రానికి రావొచ్చు కదా’ అని కొందరు ముఖ్యమంత్రులు ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం-అక్కడి అధికారులు పనిచేసినంత వేగంగా ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు అనుకూలంగా లేవని వారికి మేం స్పష్టం చేశాం’’ అని అదానీ కంపెనీ సీఈవో అనిల్‌ సార్దానా వెల్లడించారు. అభివృద్ధి చేయాలనే లక్ష్యం ఉండడం వేరు, అమలు చేయడం వేరని, అలాంటి అమలు సంకల్పం కేవలం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దగ్గర మాత్రమే చూశామని దావోస్‌ ఆర్థిక సదస్సు సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత భారీ డేటా సెంటర్‌ను మన రాష్ట్రంలో ఏర్పాటుచేసేందుకు ఆదానీ కంపెనీ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
 
à°† డేటాసెంటర్‌ ఏర్పాటుకు సంబంధించిన అంశాలతో పాటు మరిన్ని విషయాలను దావోస్‌ పర్యటనలో ఉన్న ఐటీ శాఖమంత్రి లోకేశ్‌ బృందంతో సార్దానా పంచుకొన్నారు. రాష్ట్రంలో చాలా వేగంగా అనుమతులు ఇస్తున్నారని, అంతే వేగంతో డేటా సెంటర్‌ ఏర్పాటుచేయాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నామని లోకేశ్‌కు తెలిపారు. అమరావతి అభివృద్ధిలోనూ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
 
‘‘కనెక్టెడ్‌ స్మార్ట్‌ నగరాల ఏర్పాటులో అదానీ సర్వీసెస్‌ సేవలు అందిస్తోంది. విద్యుత్‌ సరఫరా, ఫైబర్‌ కనెక్టివిటీ, టెలిఫోన్‌, తాగునీటితో పాటు పార్కింగ్‌, స్ర్టీట్‌ లైలింగ్‌, ఏసీ ఇలా అనేక సర్వీసులు కలిపి ప్రజలకు అందించే వ్యవస్థ ప్రస్తుతం భారత్‌లో లేదు. à°ˆ సర్వీసులన్నీ కలిపి ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం అందిస్తాం’’ అని సార్దానా పేర్కొన్నారు. రాష్ట్రంలో డేటా సెంటర్‌ పార్కు ఏర్పాటును వేగవంతం చేయాలని, అవసరమైన అనుమతులు, మౌలిక వసతులు à°ˆ నెలాఖరులోగా కల్పిస్తామని ఆయనకు లోకేశ్‌ తెలిపారు. జనవరి నెలాఖరుకు భూమిపూజ పనులు ప్రారంభించాలనగా, సార్దానా సానుకూలంగా స్పందించారు. అమరావతిలో డిస్ర్టిక్ట్‌ కూలింగ్‌ ఏర్పాటుచేస్తున్నామని, అన్ని సర్వీసులు కలిపి అందించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారని, à°ˆ పనిలో అదానీ సహకారం అందించాలని లోకేశ్‌ కోరారు.