లైమ్‌స్టోన్‌ అక్రమ తవ్వకాలపై నివేదికివ్వండి

Published: Friday January 25, 2019

గుంటూరు జిల్లాలోని లైమ్‌స్టోన్‌ అక్రమ తవ్వకాల వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, 3 వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం సీఐడీని ఆదేశించింది. కేశనుపల్లి, నడికుడి, కోనంకి, పిడుగురాళ్ల గ్రామాల్లో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని, ఆయన అనుచరగణం లైమ్‌స్టోన్‌ అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యంపై దాఖలు చేశారు. బుధవారం దీనిపై విచారణ సందర్భంగా హైకోర్టు.. సీఐడీ దర్యాప్తు పట్ల అసంతృప్తి వ్యక్తంచేసింది. గురువారం జరిగిన విచారణలో సీఐడీ అందించిన వివరాలను దర్మాసనం పరిశీలించింది. మూడు వారాల్లో పూర్తి దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.