ప్రైవేటు సంస్థల్లోనూ కల్పనకు ప్రయత్నం

Published: Monday January 28, 2019
‘బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్‌ కావాలి. దీనిపై ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. ఉద్యోగాలు తగ్గిపోయాయి. దీనివల్ల రాజ్యాంగ సవరణ చేసైనా ప్రైవేట్‌ సంస్థల్లోనూ రిజర్వేషన్‌ ఇవ్వాలి. అందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు. బీసీల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ‘జయహో బీసీ’ సభలో ఆయన మాట్లాడుతూ... బీసీల్లో అనైక్యత సృష్టించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని, వాటిని ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశం వస్తుందని, అప్పుడు దేశవ్యాప్తంగా బీసీ జనగణన జరిపించడానికి ఒత్తిడి తెస్తామన్నారు. కొందరు కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట చిచ్చుపెట్టాలని చూస్తున్నారని యనమల ఆరోపించారు. బీసీలు కలసిమెలసి ఉండాలని, టీడీపీ వల్లే మన జీవితాలు బాగుపడతాయన్నారు.
ఇంకా ఎవరేమన్నారంటే...బీసీ సబ్‌ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించి, నామినేటెడ్‌ పదవుల్లో ఎక్కువ మందికి అవకాశం ఇచ్చేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తుంది.