అంగన్‌వాడీలో ఐఏఎస్‌ బిడ్డ

Published: Thursday January 31, 2019

నిరుపేదలు సైతం తాహతుకు మించి పిల్లలను కార్పొరేట్‌ స్కూళ్లలో చేర్పిస్తుండగా, ఓ ఐఏఎస్‌ అధికారి తన కుమారుడిని అంగన్‌వాడీ కేంద్రానికిపంపి ప్రభుత్వ విద్యపై విశ్వాసాన్ని చాటుతున్నారు. సీతంపేట ఐటీడీఏ పీవో శివశంకర్‌ చిన్న కుమారుడు స్వాహానంద్‌ వయసు రెండేళ్లు. స్వాహానంద్‌ ప్రతిరోజూ సీతంపేటలోని అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తున్నాడు. తోటి పిల్లలతో కలిసిపోయి ఆనందంగా అక్కడే పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నాడు. అక్కడ అందించే పౌష్టికాహారాన్ని మిగిలిన పిల్లలతోపాటు తింటున్నాడు. ఇటీవల స్వాహానంద్‌ పుట్టినరోజు వేడుకలను కూడా ఆ అంగన్‌వాడీ కేంద్రంలోనే పీవో దంపతులు నిర్వహించారు. జిల్లా ప్రముఖులు, పలువురు పీవోను అభినందిస్తున్నారు.